Home Page SliderNational

సల్మాన్‌ఖాన్‌కు దుబాయ్ నుండి బుల్లెట్ ఫ్రూఫ్ కారు

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ నుండి బుల్లెట్ ఫ్రూఫ్ కారును కొనుగోలు చేశారు. ప్రభుత్వం కూడా ఆయన భద్రతను పెంచింది. ఈ కారు ధర రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. సల్మాన్‌ఖాన్ హిందీ బిగ్‌బాస్ షోలో దాదాపు 60 మంది సెక్యూరిటీ సిబ్బందితో పాల్గొంటున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో చాలాసార్లు బిష్ణోయ్ గ్యాంగ్ పగబట్టినట్లు ఆయనను వెంటాడుతోంది. ఇటీవల సల్మాన్‌ఖాన్ మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ హత్యకు కూడా కారణం ఈ గ్యాంగే అని తెలిసిందే.