విడుదలకు ముందే సలార్ రికార్డు
డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. దేశంలోనే కాదు, విదేశాలలో కూడా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ సంవత్సరం అత్యంత వేగంగా మిలియన్ యూఎస్‌ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన సినిమాగా ఘనత వహించింది సలార్. ఈ విషయాన్ని సలార్ మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా కాలంగా వాయిదాలు పడుతూ చివరికి డిసెంబరు 22న విడుదల కానుంది. దీనితో ప్రేక్షకులలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.