Home Page SliderTelangana

దివ్యాంగుడి పాటకు సజ్జనార్ ఫిదా..కీరవాణికి రిక్వెస్ట్

తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ బస్సులో ప్రయాణిస్తున్న ఒక దివ్యాంగుడి పాటకు ఫిదా అయిపోయారు. చక్కగా పాటను పాడుతూ, తాళం వేస్తూ పాడిన పాట ఆయన మనసును ఆకట్టుకుంది. ఒక అంధుడు బస్సులో ప్రయాణిస్తూ ‘శ్రీ ఆంజనేయం’ అనే చిత్రంలోని ‘రామ రామ’ అనే పాటను చాలా చక్కగా ఆలాపన చేశారు. ఈ పాటను ట్వీట్ చేస్తూ సజ్జనార్ సినీ సంగీత దర్శకుడు కీరవాణికి రిక్వెస్ట్ చేశారు.  ‘ఇలాంటి మట్టిలో మాణిక్యం వంటి గాయకులు ఎందరో ఉన్నారు. అతనికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ కీరవాణి గారూ’ అంటూ కీరవాణిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.