Home Page SliderTelangana

హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ వారోత్సవాలు

 గాలిని తమకనుకూలంగా మార్చుకుంటూ చిన్న చిన్న తెరచాప బోట్లతో నీటిలో జోరుగా దూసుకుపోవడమే సెయిలింగ్.  తెలంగాణ సెయిలింగ్‌ క్లబ్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌ల ప్రోద్బలంతో హైదరాబాద్‌లో సెయిలింగ్ వారోత్సవాలు జరుగుతున్నాయి.  ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరులో జరుగుతూ ఉంటాయి ఈ పోటీలు. ఈత వచ్చిన పిల్లలు కూడా ఈ సెయిలింగ్ పోటీలకు తయారు కావచ్చు. వారు కోచింగ్ కూడా ఇస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి సెయిలింగ్ పోటీలు మొదటి సారి కాదన్నారు,  ఇది చాలా ప్రాచీన క్రీడ అని అంటున్నారు నిర్వాహకులు. ఈ పోటీల ముగింపు పోటీలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై విచ్చేస్తున్నారు. ఈ పోటీలో గెలిచిన వారిని ఆసియా గేమ్స్‌కు, ఒలింపిక్స్ గేమ్స్‌కు తీసుకు వెళ్తున్నారని తెలియజేశారు. ఇప్పటికే ఈ పోటీలలో గతంలో ఒలింపిక్స్‌కు,ఆసియా గేమ్స్‌కు వెళ్లిన వారు ఐదారు మంది ఉన్నారని మంచి శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు విభాగాలలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 37 వ జాతీయ ర్యాంకింగ్‌లో ఈ క్రీడ నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే హుస్సేన్ సాగర్ నీటితోనే తమకు ఇబ్బంది అంటున్నారు సెయిలర్లు. నీరు చాలా మురికిగా ఉండడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.