Home Page SliderTelangana

ప్రియురాలి హత్య కేసులో సాయికృష్ణకు రిమాండ్

దారుణంగా ప్రియురాలు అప్సరను హత్యచేసి, మ్యాన్‌హోల్‌లో పాతిపెట్టిన కేసులో హంతకుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది శంషాబాద్ కోర్టు. సాయికృష్ణను ప్రస్తుతం చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అప్పటికే పెళ్లయి, పిల్లలున్న సాయికృష్ణ సరూర్ నగర్‌లోని ఓ గుడిలో పూజారిగా పని చేస్తున్నారు. అప్సర అనే యువతి పరిచయం కావడంతో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఒప్పుకున్నాడు సాయికృష్ణ. ఆమె గర్భం దాల్చిందని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోందనే కారణంతో ఆమెను హత్యచేసి, తాను పని చేసే గుడి వెనుకే మ్యాన్‌హోల్‌లో పాతి పెట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లు అప్సర కనిపించడం లేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడడంతో సాయికృష్ణే హంతకుడని తేలడంతో అతడిని అరెస్టు చేసి, శంషాబాద్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.