Home Page SliderNational

వివాదంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ హీరో తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. కాగా నిన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి స్వయంగా హారతి ఇచ్చారు. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది. నిబంధనల ప్రకారం స్వామివారికి కేవలం అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని ఉంది. నిబంధనలకు విరుద్ధంగా హీరో సాయిధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.