Home Page SliderTelangana

గిడ్డంగుల ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్ భార్య బాధ్యతల స్వీకరణ

తెలంగాణా గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణా సీఎం కేసీఆర్ ఆ పదవిని సాయిచంద్ భార్య రజినికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా సాయిచంద్ భార్య రజినిని గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌గా సాయిచంద్ భార్య వేద రజిని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు.