Home Page SliderTelangana

కుంగిన వంతెన.. రాకపోకలు బంద్..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెం గ్రామ శివారులోని రాళ్లవాగుపై నిర్మించిన వంతెన నిన్న రాత్రి కుంగిపోయింది. దీంతో బ్రిడ్జి పై నుండి రాకపోకలు నిలిపివేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిర్వహిస్తున్న ఇసుక రీచులు నుండి ఓవర్ లోడ్ లో వస్తున్న లారీల వల్లనే రహదారి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు నుండి భద్రాచలం వెళ్లే ప్ర యాణికులు ఏటూరు నాగారం, మణుగూరు మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.