Home Page SliderTelangana

నిండుకుండలా సాగర్ జలాశయం-12 గేట్లు ఎత్తి వరదనీరు విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరదనీరు విడుదల కావడంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీనితో అధికారుల కృష్ణానదికి జలహారతి ఇచ్చి 12 గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కొక్కటిగా 12 గేట్లను ఎత్తుతూ, దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం సైరన్ మ్రోగించారు. ఈ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా, ఇప్పటికే 583.60 అడుగులకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 293.39 టీఎంసీలు ఉంది.