‘సాగర్ ఎడమకాలువ గండ్లపాపం బీఆర్‌ఎస్ పార్టీదే’..ఉత్తమ్ కుమార్ రెడ్డి
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండ్లు పడ్డాయని ఆరోపించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగర్ కాలువ గండి మరమ్మత్తులు జాప్యం చేస్తున్నారంటూ మాజీమంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించడంపై ఆయన స్పందించారు. నీటిపారుదల శాఖను నిర్వీరం చేసి, కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చేశారని, పైగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సాగర్ కాలువ గండి మరమ్మతులు వేగంగా జరగుతున్నాయని, భారీ వర్షాలు, వరదలతో కాలువలకు సూర్యాపేట జిల్లాలో కూడా వరద నష్ట సహాయక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.