హాస్పిటల్ నుంచి సైఫ్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు కత్తితో దాడి చేయగా సైఫ్ అలీఖాన్ కు గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు.. దాడి ఘటనతో అప్రమత్తమైన ఆయన సిబ్బంది సైఫ్ నివాసం వద్ద సీసీ కెమెరాలు అమర్చుతున్నారు.