శబరిమల స్వామి ఆలయం మూసివేత..!
కేరళలోని శబరిమల ఆలయం తలుపులు ఇవాళ రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం తలుపులు ఈనెల 30న సాయంత్రం 5 గంటలకు తెరువనున్నారు. జనవరి 15న సాయంత్రం 6:36:45 గంటలకు జ్యోతి దర్శనం భక్తులకు కలుగుతుంది. తిరిగి జనవరి 20న ఉదయం 6.30 గంటలకు మూసివేయబడుతుంది. ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతి లేదు.