రైతు భరోసా 5 ఎకరాలకు మాత్రమే (సీలింగ్)?
తెలంగాణ: రైతు భరోసా (ఇదివరకు రైతు బంధు) మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని డిసైడ్ చేసినట్లు సమాచారం. సాగుచేసే రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.

