Home Page SliderTelangana

అక్రమంగా పొందిన రైతుబంధు డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందే..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుబంధు నిధులు అక్రమంగా కొందరికి చేరినట్లు గుర్తించారు అధికారులు. మేడ్చల్ జిల్లాలో ఈ రకంగా ఎన్నో ఎకరాల భూమికి వ్యవసాయభూమి కాకపోయినా రైతుబంధు డబ్బు చేరింది. ఘట్‌కేసర్-పోచారంలోని రైతు యాదగిరి 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించినప్పటికీ రైతుబంధు లబ్దిని పొందారని గుర్తించారు. ఇప్పటివరకూ పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని అతనికి నోటీసులు పంపారు. ఈ మండలంలో 30 వేల ఫార్మాల్యాండ్ మాత్రమే ఉంటే 66 వేల ఎకరాలకు రైతుబంధు అందిందని జిల్లా కలెక్టర్ గుర్తించారు. దీనితో అధికారులు ఖంగుతిన్నారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి చెల్లించిన రైతుబంధును రికవరీ చేయాల్సిందిగా కొందరు రైతులకు నోటీసులు పంపారు.