ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తామన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తామకుంటున్నట్లు చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. యుద్ధాన్ని “త్వరగా ముగించడం ఎంతో మంచిదన్నారు. లక్ష్యం… ఈ సంఘర్షణను అంతం చేయడమేనంటూ కొత్త వర్షన్ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే యుద్ధ ముగిసిపోతుందన్నారు. రష్యాను బలహీనపరిచేందుకు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌ను యుద్ధభూమిగా ఉపయోగిస్తోందని ఆరోపించారు పుతిన్. రష్యా పోరాటాన్ని త్వరితగతిన ముగించాలని లక్ష్యంగా పెట్టుకుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నొక్కిచెప్పారు. “మా లక్ష్యం.. ఈ వివాదాన్ని అంతం చేయడమే. దీని కోసం మేము ప్రయత్నిస్తున్నాము” అని ఆయన విలేకరులతో అన్నారు. “అదంతా ముగుస్తుందని, ఎంత త్వరగా అంత మంచిది అని నిర్ధారించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.” అని పుతిన్ చెప్పారు. అన్ని వివాదాలు చర్చలతో ముగుస్తాయన్నారు.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై రష్యా మిలిటరీ మండిపడుతోంది. మాస్కో మిలిటరీ చీఫ్ మాట్లాడుతూ రష్యా దళాలు ఇప్పుడు తూర్పు డొనెట్స్క్ ప్రాంతంపై నియంత్రణ సాధించడంపై దృష్టి సారించాయని, ఇక్కడ దెబ్బతిన్న నగరం బఖ్‌ముట్ పోరాటానికి కేంద్రంగా మారిందని చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలను తాము తోసిపుచ్చలేదని మాస్కోలోని అధికారులు ఇటీవలి నెలల్లో పదేపదే చెబుతున్నారు. పుతిన్ అధికారంలో ఉన్నప్పుడు చర్చలు జరపబోనని చెప్పిన ప్రెసిడెంట్ జెలెన్స్కీపై దౌత్య మార్గాలను మూసివేయడాన్ని వారు తప్పుబట్టారు.