జగన్ హయాంలో రుషికొండ..ఓ బోడి కొండ: పవన్ కళ్యాణ్
వైసీపీ హయాంలో విశాఖలోని రుషికొండ బోడిగా తయారయ్యిందని ..ఏపీలోని ప్రతిపక్షాలు అధికారపక్షంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్‌కళ్యాణ్ రుషికొండ తవ్వకాలపై వైసీపీ ప్రభుత్వానికి చురకలు వేశారు. కాగా రుషికొండపై నిర్మాణాల విషయంలో YCP ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిందని నిపుణుల కమిటీ నిర్ధారించిందన్నారు. అయితే దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా?లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అని ప్రశ్నిస్తూ.. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏపీలోని చెట్లు నరకడం,తీరప్రాంతాలు,మడ అడవులను నాశనం చెయ్యడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.