సెప్టెంబర్ 27 నుండి అక్టోబరు 7 వరకు గ్రామీణ కళాకారుల ఫేర్
గ్రామీణ కళాకారులు (SHG సభ్యులు) ఉత్పత్తి చేసే కళాకృతులను ప్రదర్శించడానికి SARAS FAIR, 2024, సెప్టెంబర్ 27 నుండి అక్టోబరు 7 వరకు పీపుల్స్ ప్లాజా, PVNR మార్గ్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి 300 స్వయం సహాయక సంఘాల (SHG) కళాకారులు పాల్గొంటారు. వారిచే తయారుచేయబడిన వివిధ హస్తకళలు, చేనేతలు, సేంద్రీయ ఆహార పదార్ధాలు, విభిన్న ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
ఈ ఉత్పత్తులను చూడడానికి, కొనుగోలు చేయడానికి మరియు భారతదేశంలోని గ్రామీణ కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) తెలిపింది.

