Andhra PradeshHome Page Slider

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ..

విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ యూట్యూబ్ ఛానల్ స్టూడియోపై పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.