Home Page SliderTelangana

“రన్ ఫర్ గ్రేస్-స్క్రీనింగ్ ఫర్ లైఫ్”.. మంత్రి

ముందస్తు పరీక్షలతో కేన్సర్ ను కట్టడి చేద్దాం అని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసిన “రన్ ఫర్ గ్రేస్-స్క్రీనింగ్  ఫర్ లైఫ్” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేన్సర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా లక్షలాది జీవితాలను కబళించివేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. కేన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. కేన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నప్పటికి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలను హరిస్తుదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వారు ఉచిత కేన్సర్ స్క్రీనింగ్‌లు చేస్తూ ప్రజలను కేన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు నిరుపేదలచికిత్సకు సహాయం అందించడం మంచి విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లితో పాటు వేలాదిగా యువత రన్ లో పాల్గొన్నారు.