మహిళలు బస్సు ఎక్కకూడదన్న ఆర్టీసీ డ్రైవర్
హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్డు దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సును డ్రైవర్ ఆపలేదు. రన్నింగ్ బస్సు ఎక్కి మహిళ కిందపడింది. మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కింద పడిన మహిళతొ ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాగ్వాదం చేసుకున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో ప్రయాణికులు వాగ్వాదం చేసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ పై దృష్టి సారించి ఇలాంటి డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.