ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు..
స్టీరింగ్ రాడ్ విరిగి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట – చింతలపాలెం శివారులో జరిగింది. ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను మేళ్లచెరువు, హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రులకు తరలించారు. కోదాడ నుంచి నక్కగూడెం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.