పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీనగర్ సమీపంలో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
గాయపడిన వారిని తక్షణమే దాచేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిర్యాలగూడ డిపోకు చెందిన ఈ బస్సు దాచేపల్లికి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

