Home Page SliderNational

తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షల సహాయం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సహాయనిధికి చెరో రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఏర్పడిన వరద పరిస్థితులు తనను చాలా తీవ్రంగా కలచివేశాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు ప్రధాని మోదీ తనకు చెప్పారని, ఇక్కడి పరిస్థితులపై తాను మోదీతో మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సహాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని వెంకయ్యనాయుడు తెలిపారు. తనతో పాటు తన కుమారుడు, కుమార్తె కూడా విడివిడిగా ఏపీ, తెలంగాణాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున అందజేశారని వెల్లడించారు.