Home Page SliderTelangana

వారికి కూడా రూ.30 కోట్ల రుణమాఫీ

తెలంగాణ నేతన్నలకు గుడ్‌న్యూస్ చెప్పింది రాష్ట్రప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రూ.30 కోట్ల రుణమాఫీని చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కుల వృత్తులకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించామని తెలిపారు. తిండి,గుడ్డ రెండూ ప్రజలకు నిత్యావసరాలని అందుకే అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేసినట్లే కట్టుకోవడానికి బట్టలనిచ్చే నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. వారిద్దరూ రాష్ట్రానికి వెన్నుముకలాంటివారన్నారు.