Home Page SliderTelangana

వికారాబాద్‌లో రూ.235 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల

వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ. 235 కోట్లతో నిర్మించే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భూమి పూజ చేశారు. అనంతరం  అనంతగిరి గుట్టలోని తాత్కాలిక భవనాలలో జరుగుతున్న మెడికల్ కాలేజీ తరగతి గదులను, విద్యార్థుల వసతి సౌకర్యాలను స్పీకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రమేశ్,  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,  జిల్లా SP నారాయణరెడ్డి,  ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మెడికల్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.