అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలు రైతు భరోసా: తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 31 నాటికి మిగిలిన రూ.13 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.15 వేలు రైతులకు అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది. రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించి… అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు సాంకేతిక అడ్డంకులు తొలగించే పనిలో ఉన్నారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కీలక ప్రకటన చేశారు.

