పుష్ప ఘటన.. రూ. 2 కోట్ల పరిహారం
పుష్ప-2 చిత్రం తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి మూవీ టీం, హీరో అల్లు అర్జున్ కలిపి భారీ నష్ట పరిహారం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షల పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రిలో రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను కలిసి పరామర్శించారు.