Home Page SliderTelangana

‘రూ.2 కోట్ల కంపెనీకి రూ.1000 కోట్ల పనులు అప్పగించారు’..కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ మంత్రులు అధికారంలోకి వచ్చినప్పడి నుండి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుమ్మక్కయిపోయాయని పేర్కొన్నారు. నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి కేవలం రూ.2 కోట్ల లాభం మాత్రమే ఉంటే, ఆ కంపెనీకి రూ.1000 కోట్ల విలువైన పనులు అప్పగించారని మండిపడ్డారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల భాగస్వమ్యంతో ఏర్పాటు చేసిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారన్నారు. సీఎం అధికార దుర్వినియోగం చేశారన్నారు. ఆ కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు అప్పగించారు. టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాశాం అంటూ పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.