ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డులు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇంటర్నేషనల్ అవార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కించుకుంది. లాస్‌ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికయ్యారు. మరోవైపు బోస్టన్ సోసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు కీరవాణి అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్‌లైట్ అవార్డును ఆర్‌ఆర్‌ఆర్ సొంతం చేసుకుంది. దీంతోపాటు మరెన్నో అంతర్జాతీయ అవార్డులను ఆర్‌ఆర్‌ఆర్ అందుకుంది.