IPL చరిత్రలోనే RR చెత్త రికార్డు
ఈ IPL సీజన్‌లో ట్రోఫీని గెలుచుకునేందుకు అన్ని జట్టులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ..ఈ సీజన్‌లో IPL జట్టులన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని జట్టులు మాత్రం IPL చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే తాజాగా నిన్న జరిగిన RR Vs GT మ్యాచ్‌లో RR ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అదేంటంటే ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా RR నిలిచింది. కాగా GT తో జరిగిన మ్యాచ్‌లో RR టీమ్ తొలి 6 ఓవర్లలో 26/2 పరుగులు చేసింది. అయితే ఈ సీజన్‌లో ఇదే అతి తక్కువ స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ RCB పై చేసిన 29/3 పరుగులు మాత్రమే అతి తక్కువ స్కోర్‌గా ఉండేది. అయినప్పటికీ నిన్న జరిగిన మ్యాచ్‌లో GT పై RR పైచేయి సాధించింది. అయితే ఈ విజయానికి తోడ్పడ్డ కీలక సూత్రదారులు హెట్‌మయర్,సంజూ శాంసన్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరు నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్థ సెంచరీ కంటే ఎక్కువ పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో వీరికి గట్టి పోటి ఇచ్చిన GT ఓటమిని చవిచూడక తప్పలేదు.

