Home Page SliderNational

“రాయల్టీ అనేది ట్యాక్స్ కాదు”..రాష్ట్రాలకు అనుకూలంగా సుప్రీం తీర్పు

రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలలో ఉండే ఖనిజాలపై హక్కు ఉంటుందని, రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.  రాయల్టీని పొందే రాష్ట్రాలు వాటిపై లెవీ ట్యాక్స్‌ను తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ 8మంది జడ్జిల ఏకాభిప్రాయంతో ఈ తీర్పును వెల్లడించింది. ఈ న్యాయమూర్తుల బృందానికి ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నాయకత్వం వహించారు. దీనితో కేంద్రానికి ఈ విషయంలో గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. మైనర్లు కేంద్రానికి చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించలేమని అది ఒక ఒప్పంద చెల్లింపు మాత్రమేనని పేర్కొంది. రాష్ట్రాలు తమ భూభాగంలో ఉండే ఖనిజాలు, గనులపై సుంకం విధించే అధికారాన్ని కలిగి ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు మాత్రమే MMDRA కింద రాయల్టీని వసూలు చేసే అధికారం ఉందని వెల్లడించింది.