Home Page SliderNational

పెళ్లిపై రౌడీబాయ్ క్లారిటీ

పెళ్లి తర్వాత తన జీవితం ఇలాగే ఉండాలంటూ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేశారు. ఖుషీ చిత్రంలో నిన్న విడుదలైన ‘ఆరాధ్యా’ అనే పాట తనకు ఎంతో నచ్చిన పాట అని, ఆ పాటలో చూపించినట్లుగా తన వివాహానంతర జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానన్నాడు. ఆరాధ్య అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో సమంతా, విజయ్ దేవరకొండలు భార్యాభర్తలుగా మంచి కెమిస్ట్రీ పండించారు. అన్యోన్య దాంపత్యమంటే ఇదే అన్నట్లు సాగిన సన్నివేశాలతో ప్రేక్షకులను మైమరిపించారు. మంచి సంగీతంతో, స్వరాలతో సాగిపోయే ఈ పాటను ప్రసిద్ధ గాయకుడు సిద్ శ్రీరామ్, గాయని చిన్మయి ఆలపించగా, తమ నటనతో అందంగా ఈ పాటను చూపించారు సామ్, విజయ్‌లు. రష్మిక, విజయ్‌ల మధ్య ఏదో నడుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో విజయ్ పెళ్లి గురించి మాట్లాడేసరికి రష్మిక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.