యూట్యూబ్‌లో “రొనాల్డో” సంచలనం-రోజు గడవకముందే ‘కోటి సబ్‌స్క్రైబర్లు’
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. అలాంటి వ్యక్తి యూట్యూబ్ ఛానెల్ పెడితే ఇలా ఉంటుందని సంచలనం సృష్టించాడు రొనాల్డో. పోర్చగల్ స్టార్ ప్లేయర్ యూట్యూబ్ ఛానల్‌తో చరిత్ర సృష్టించాడు.యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన కేవలం 90 నిమిషాలలో 10 లక్షల సబ్‌స్క్రైబర్లు సాధిస్తే, సగం రోజు కూడా గడవకముందే ఆ సంఖ్య కోటి దాటేసింది. దీనిలో 19 వీడియోలు పోస్టు చేశారు. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, రొనాల్డో ట్విట్టర్ ఖాతాకు 11 కోట్లమంది, ఫేస్‌బుక్‌కు 17 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ప్రారంభం సందర్భంగా రొనాల్డో ట్విట్టర్‌లో స్పందిస్తూ.. వెయిటింగ్ ముగిసింది. నా కొత్త యూట్యూబ్ ఛానల్‌లో అభిమానులు సబ్‌స్క్రైబ్ చేసుకుని, కొత్త ప్రయాణంలో చేరండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.