Home Page SliderNational

అభిమాని హత్యకేసులో హీరో దర్శన్ భార్య పాత్ర

తన వీరాభిమాని రేణుకాస్వామిని హత్య చేయించి శిక్ష అనుభవిస్తున్న కన్నడ హీరో దర్శన్ కేసులో కీలక ట్విస్టులు బయటపడుతున్నాయి. తన ప్రియురాలు పవిత్రగౌడను సోషల్ మీడియాలో ట్రోల్ చేయించినందుకు అభిమానినే హత్య చేయించిన దర్శన్ కేసు విషయంలో అతని భార్య విజయలక్ష్మికి కూడా సంబంధం ఉండొచ్చన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ హత్య అనంతరం తన భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. దర్శన్ హత్యకు వినియోగించిన లోఫర్స్ అతని భార్య ప్లాట్ వద్ద పోలీసులకు దొరికాయి. ఆమె ఇంటికి వెళ్లి పూజలు కూడా చేసినట్లు గుర్తించారు. హత్య అనంతరం దుస్తులు, ఫుట్‌వేర్‌ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ తెచ్చి భార్య విజయలక్ష్మికి ఇచ్చినట్లు గుర్తించారు. దీనితో ఆమెకు కూడా నోటీసులు జారీ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. ఆమెను సాక్షిగా భావించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దర్శన్ ఫ్యాన్ క్లబ్‌ మెంబర్లకు కూడా దర్శక నిర్మాతల నుండి, దర్శన్ నుండి సొమ్ములు అందుతున్నాయి. ఈ హత్యలో ఫ్యాన్స్ క్లబ్‌లోని వారు కూడా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.