జగన్ తిరుమలకు ఎందుకు రాలేదో చెప్పిన రోజా..
వైసీపీ నేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య విరమించుకున్న సంగతి తెలిసిందే. జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దానికి కారణాలను కూడా వివరించారు. అయితే మాజీ మంత్రి రోజా ఈ విషయంపై స్పందించారు. జగన్ తిరుమల దర్శనానికి రాకుండా కూటమి నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇవ్వాలని, నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దైవదర్శనానికి ఇన్ని ఆంక్షలు పెట్టడంతో ఆయన మానసికంగా బాధపడ్డారు. ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని జగన్ అనుకుంటున్నారు. వివాదాలు సృష్టించడం ఇష్టం లేక పర్యటన వాయిదా వేసుకున్నారు అంటూ వివరణ ఇచ్చారు. మరోపక్క చంద్రబాబు తిరుమల దర్శనానికి జగన్‌ను రావొద్దని తాము చెప్పలేదని పేర్కొన్నారు. జగన్ ఇష్టపూర్వకంగానే రాలేదన్నారు.