InternationalNews

కెప్టెన్‌గా అదరగొడుతున్న హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుస విజయాలను కైవసం చేసుకుంటున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలో హిట్ కొట్టలేక పోయినప్పటికీ..కెప్టెన్‌గా మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా వరుస విజయాలతో ఔరా అనిపిస్తున్నాడు.  టీమ్ ఇండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడుగా చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ 2022లో పాక్‌తో తలపడి టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా అంతర్జాతీయ టీ 20 ల్లో 30 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లల్లో విజయాలు సాధించాడు. ఈ మేరకు అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ (83.33) కలిగిన కెప్టెన్‌గా అరుదైన రికార్డుకు రోహిత్ శర్మ శ్రీకారం చుట్టాడు.