రోహిత్ శర్మ WTC మ్యాచ్ కూడా IPL లాంటిదే
ఇటీవల జరిగిన WTC ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్‌ఇండియా ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా జట్టు సభ్యలను ఎన్నిక చేయడంలోనే రోహిత్ విఫలమయ్యారని పలువురు క్రికెట్ ప్రముఖులు ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశారు. కాగా రోహిత్ శర్మ WTC ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం WTC ఫైనల్ మ్యాచ్‌లో 3 మ్యాచ్‌లు ఉండాలని చెప్పారు. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ మరోసారి రోహిత్ శర్మపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..ఇది ముందే నిర్ణయించబడింది. కాబట్టి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఇది కూడా IPL మ్యాచ్ లాగానే..బెస్ట్ ఆఫ్ థ్రీ అని అడగొద్దు అన్నారు. ఆటలో ప్రతి ఒక్కరికి బ్యాడ్ డేస్ ఉంటాయి. మొదటి బాల్‌కు ముందే మీకు అది తెలిసిపోతుంది. కాబట్టి మీరు బెస్ట్ ఆఫ్ థ్రీ అడగొద్దని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇలా అడుగుతూ పోతే రానున్న రోజుల్లో బెస్ట్ ఆఫ్ ఫైవ్ కూడా అడిగేలా ఉన్నారని సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మకు చురకలు వేశారు.

