Home Page SliderNational

యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్‌శర్మ వీడియో

వన్డే వరల్డ్ కప్ -2019లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టించింది. ICC యూట్యూబ్ ఛానెల్‌లో మరి ఏ వీడియోకి దక్కనంత క్రేజ్‌ని ఈ వీడియో సంపాదించింది. అదేంటంటే ICC యూట్యూబ్ ఛానెల్‌లో 100మిలియన్ల వ్యూస్ నమోదుచేసుకున్న మొదటి వీడియోగా నిలిచింది. కాగా ఆ మ్యాచ్‌లో రోహిత్ 113 బంతుల్లో 140 రన్స్‌తో చెలరేగిపోయాడు. దీంతో భారత్ 336 పరుగులు చేసి ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది. కాగా ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేసిన పాక్ 40 ఓవర్లలలో 216/6 పరుగులు చేసింది. అయితే ఆ సమయంలో వర్షం పడడంతో భారత్ 89 రన్స్‌తో గెలిచినట్లు ప్రకటించారు.