Home Page SliderNational

కొంపముంచిన రోహిత్ శర్మ అతివేగం..

‘అతి సర్వత్రా వర్జయేత్’ అనేది అందరికీ తెలిసిన నానుడి. ఏ విషయంలోనూ అతి పనికి రాదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతి వేగం అతని కొంపముంచింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగబోతున్న ఈ  సమయంలో వివాదంలో చిక్కుకున్నాడు రోహిత్. ముంబయ్-పుణె మార్గంలో అతని కారు అత్యంత వేగంగా దూసుకుపోయింది. గంటకు  200 కిలోమీటర్ల పైగా వేగాన్ని అందుకుంది. ఒక దశలో అత్యధిక వేగం గంటకు 215 కిలోమీటర్లు కావడంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. వివిధ ప్రదేశాలలో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినట్లు గుర్తించారు. దీనితో కారు యజమాని రోహిత్ దానికి బాధ్యునిగా గుర్తిస్తూ చలానాలు వేశారు. క్రికెట్‌లో వేగంగా రన్స్ తీయడం రికార్డు కావచ్చు కానీ రోడ్డు మీద కాదంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.