Home Page SliderSports

లక్షల లైక్స్‌తో రోహిత్ శర్మ ఫన్నీ వీడియో వైరల్

టీమిండియా లక్కీ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటూంది. తాజాగా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియోను షేర్ చేశారు రోహిత్. సీరియస్‌గా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియోలను, సరదాగా గడిపే వీడియోలను షేర్ చేశారు. 99 శాతం వర్కవుట్, 1 శాతం సరదా అంటూ దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కేవలం నాలుగైదు గంటల్లోనే మిలియన్ లైక్స్‌కు పైగా సొంతం చేసుకుంది. ఈ వీడియోలో రన్నింగ్, టైర్ ఫ్లిప్ వంటి వ్యాయామాలు చేశారు. సరదా వీడియోలో ఫ్రెండ్స్‌ను ఆటపట్టించడం, ముచ్చట్లు చెప్పుకోవడం వంటి సంగతులు ఉన్నాయి. త్వరలో రోహిత్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌కు సిద్దమవుతున్నారు. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కూడా ఉంది. 12 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోను చూశారా…