“రోహిత్ శర్మ ఏ మాత్రం స్వార్థంలేని ఆటగాడు”:పాక్ బౌలర్
రేపు ఇండియా Vs సౌతాఫ్రికా T20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్ రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా T20 వరల్డ్ కప్ సాధించేందుకు రోహిత్ శర్మ పూర్తి అర్హుడని ఆయన తెలిపారు. అయితే టీమిండియా టెస్ట్ ఛాంపియన్ షిప్,ODI వరల్డ్ కప్ మిస్ అయిన పొట్టి కప్ నెగ్గే అర్హత ఖచ్చితంగా ఉందన్నారు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ మాత్రం స్వార్థం లేని ఆటగాడని ఆయన పేర్కొన్నారు. రోహిత్ స్వప్రయోజనాల కంటే జట్టే ముఖ్యమని ఎప్పుడూ భావిస్తారన్నారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పుడు చాలా బాధ కలిగిందన్నారు. కాగా టీమిండియా పొట్టి కప్ గెలిచేందుకు అన్ని విధాలా సరైనదని పాక్ బౌలర్ షోయబ్ స్పష్టం చేశారు.