Home Page SliderNationalSports

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులతో అదరగొట్టాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా సచిన్ చేసిన 15,335 పరుగుల రికార్డును రోహిత్ శర్మ 15,404 పరుగులతో అధిగమించారు.

గత కొంత కాలంగా రోహిత్ ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కెప్టెన్‌గా పనికిరాడని, ఇక రిటైర్ అయిపోవాలని డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే వాటన్నింటికీ బ్యాట్‌తోనే ఫుల్‌స్టాప్ పెట్టారు రోహిత్. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ జట్టు మొదటి నుండే దూకుడుగా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి, 4 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. దీనితో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. మూడవ మ్యాచ్ అహ్మదాబాద్లో బుధవారం జరగనుంది.