home page sliderHome Page SliderSports

2027 ప్రపంచకప్‌పై రోహిత్–కోహ్లీ భవిష్యత్తు చర్చలు

భారత క్రికెట్‌లో తరతరాలు గుర్తుంచుకునే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ . ఈ ఇద్దరూ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. 2027 ప్రపంచ కప్లో భారత్‌కు మరోసారి కప్ అందించడం వారు లక్ష్యంగా పెట్టుకున్నారు .అయితే, వారి ఆశలకు, అంచనాలకు భిన్నంగా టీమ్ఇండియా శిబిరం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం లేదు . ఈ యోధులు 2027 వరకూ జట్టులో ఉంటారని టీమ్ మేనేజ్‌మెంట్ కానీ, సెలక్షన్ కమిటీ కానీ హామీ ఇవ్వకపోవడం ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది. కావాలనే ఈ స్టార్ ఆటగాళ్లను అణగదొక్కేందుకు, వారి భవిష్యత్తుపై గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు భారత క్రికెట్ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో వస్తున్నాయి.

ఈ సున్నితమైన అంశంపై భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒక ఇంటర్వ్యూలో గట్టిగా స్పందించారు. తన శిష్యులుగా, తన కళ్లముందే ఎదిగిన ఈ ఇద్దరు స్టార్ల పట్ల జరుగుతున్న వ్యవహారంపై ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.కొంతమంది కావాలనే రోహిత్, కోహ్లీ భవిష్యత్తు గురించి అసంబద్ధమైన, గందరగోళ చర్చలను సృష్టిస్తున్నారని రవి శాస్త్రి పరోక్షంగా బోర్డు పెద్దలు, సెలెక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.రోహిత్, కోహ్లీలు వన్డే క్రికెట్‌లో దిగ్గజాలని , ఆ స్థాయి ఆటగాళ్లతో అనవసరంగా గొడవపడకండని ఆయన చెప్పారు రవిశాస్త్రిని విలేకరి “రోహిత్, విరాట్ విషయంలో ఈ గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరు?” అని సూటిగా ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో గుంభనంగా సమాధానం ఇచ్చారు:చేసేవారు చేస్తున్నారు. అంతే చెప్పగలను. ఒక్కసారి కోహ్లీ, రోహిత్ ఫామ్ అందుకుంటే , ఈ వ్యవహారం మొత్తానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని చెప్పారు క్రికెట్ విశ్లేషకులు శాస్త్రి వ్యాఖ్యలను గమనించి, ఆయన పరోక్షంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ , టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించే మాట్లాడారని అభిప్రాయపడుతున్నారు . ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం వారి ఫామ్‌తోనే విమర్శలకు సమాధానం చెబుతున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతను వరుసగా రెండు శతకాలు సాధించి, తాను ఎప్పటికీ జట్టుకు అత్యంత కీలక ఆటగాడినని నిరూపించుకున్నాడు.అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తనదైన దూకుడు ఆటతో అర్ధ శతకం సాధించి, వన్డే ఫార్మాట్‌లో తన విలువను, అనుభవాన్ని మరోసారి చాటిచెప్పాడు.రోహిత్, కోహ్లీ తమ బ్యాట్‌తో సమాధానం చెబుతున్న ఈ తరుణంలో, వారి భవిష్యత్తు గురించి గందరగోళం సృష్టించడం అర్థరహితమని, 2027 ప్రపంచ కప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు భారత జట్టులో కొనసాగడం దాదాపు ఖాయమని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.