Home Page SliderNational

ఐపీఎల్ లో రోబో డాగ్ సందడి..

ఐపీఎల్ 2025లో రోబో డాగ్ సందడి చేసి ఆటగాళ్ళను అలరించింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఐపీఎల్ లో AI రోబో డాగ్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ముంబై, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను రోబో డాగ్ పలకరించింది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను రోబో డాగ్ అలరించింది. రోబో డాగ్ ను చూసిన ఆటగాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు.