అదిరే స్టెప్పులతో ‘రోబో’ డ్యాన్స్..
రోబో సినిమాలో ‘చిట్టి రోబో’ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయాం. కానీ అలాంటి రోజులు త్వరలోనే ఉన్నట్టున్నాయి. తాజాగా ప్రపంచకుబేరుడు ఎలాన్‌మస్క్ తన టెస్లా సంస్థకు చెందిన ‘హ్యూమనాయిడ్ రోబో’ డ్యాన్స్ వీడియోలని ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కార్ల కంపెనీగా ఉన్న ‘టెస్లా.. ‘మాది కార్ల కంపెనీ కదా’ అంటూ సరదాగా స్పందించింది. టెస్లా కంపెనీ వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని మస్క్ పేర్కొన్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా చక్కగా స్పీడు స్పెప్పులతో అదరగొట్టేస్తున్న రోబోని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

