కెన్యాలో రోడ్డు ప్రమాదం – 21 మంది మృతి
కెన్యా లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. . మహిళ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని విశ్వాసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. కెన్యాలోని కకమెగా రోడ్డులో బస్సు బోల్తా పడటంతో స్పాట్‌లోనే 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 10 మంది పురుషులు, పది మంది మహిళలతో పాటు ఒక బాలిక కూడా ఉంది. అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై మరింత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయిన వారి అంత్యక్రియలకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో
అక్కడి స్ధానికులను కంటతడి పెట్టిస్తోంది.