మళ్లీ వైసీపీలోకి ఆర్కే, మంగళగిరి వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తా
టికెట్ ఇవ్వరన్న కారణంగా డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డితో కలిసి రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. డిసెంబర్ 11న రామకృష్ణారెడ్డి వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్సీపీకి, అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీనామాను స్పీకర్ కార్యాలయంలో సమర్పించినా స్పీకర్ దానిని ఆమోదించలేదు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆయన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో నారా లోకేష్‌ను ఓడిపోతారని ఈ సందర్భంగా ఆర్కే చెప్పారు. సీఎం జగన్, మంగళగిరి సీటును బీసీలకు ఇస్తానని చెప్పారని… టికెట్ ఎవరికిచ్చినా తాను వారి గెలుపు కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. అమరావతి భూముల విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఆయన లెక్కలేనన్ని కేసులు పెట్టారు.