Home Page SliderNational

ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగుతున్న నదులు..రహదారులు మూసివేత

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో దాదాపు 100 రహదారులు మూసివేశారు. అలకనంద నది ప్రవాహం వల్ల రుద్రప్రయాగ వద్ద 10 అడుగుల శివుని విగ్రహం నీట మునిగింది. చంపావతి, అల్మోరా వంటి ప్రాంతాలలో మరో పది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, డెహ్రడూన్, తేహ్రి, హరిద్వార్‌లలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. గంగా, అలకనంద, భాగీరథి, మందాకిని, శారద, మందాకినీ నదులలో వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీనితో ఆయా ప్రదేశాలలో విపత్తు నిర్వహణ అధికారులు లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. నైనితాల్, పౌడీ జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగి పడడంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా, తవాఘాట్ జాతీయ రహదారులపై రాకపోకలు నిలిపివేశారు.