బీజేపీని ఓడగొట్టడానికి ప్రత్యర్థి పార్టీలు: కిషన్‌రెడ్డి
సనత్‌నగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు బీజేపీని ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని చేసినా ప్రజలు చైతన్యవంతులనే విషయం మరచిపోవద్దు. సనత్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డికి మద్దతుగా సోమవారం రోడ్ షో నిర్వహించి జెక్ కాలనీలో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అమ్ముడుపోతారని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే కేసీఆర్ కుటుంబానికి వత్తాసు పలుకుతారన్నారు. ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడనున్నట్లు తెలిపారు. అనేక జిల్లాల్లో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ కనిపించడం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం సీట్లు కూడా తగ్గుతున్నాయి చూస్తారు మీరు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్‌ఛార్జి సురేష్ నియోజకవర్గం కన్వీనర్ శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.