Home Page SliderInternational

AIతో అటంబాంబు కంటే ప్రమాదం-వారెన్ బఫెట్

మానవాళి మనుగడకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరంగా మారబోతోందని హెచ్చరించారు ప్రపంచ కుబేరులలో ఒకరైన వారెన్ బఫెట్. 92 ఏళ్ల వయస్సు, ఎంతో వ్యాపార అనుభవం ఉన్న ఈయన అన్ని పనులూ ఒకే యాప్‌తో పూర్తయితే ఇది చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. చాట్ జీపీటీ సామర్థ్యం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఏదైనా మంచిపని కోసమని వైజ్ఞానిక రంగం నుండి ఏదైనా తయారీ జరిగితే అది వినాశనానికి దారి తీస్తోందని హెచ్చరించారు. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో అణుబాంబు ప్రయోగం వల్ల కలిగిన దుష్పరిణామాలను ఇప్పటికే అనుభవిస్తున్నాము. ఇప్పుడీ ఏఐ వల్ల మనిషి చేసే పనులు పూర్తిగా భర్తీ చేయబడితే అది చాలా ప్రమాదమేనని పేర్కొన్నారు. మరోవైపు గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ గా పేరు పొందిన జాఫ్రీ హంటన్ కూడా ఏఐ వల్ల మనుషుల ఉద్యోగాలకు ప్రమాదమేనని ఆభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ గురించిన చర్చలు చాలా వినిపిస్తున్నాయి. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్, బింగ్ వంటివి యూజర్లకు అందుబాటులోకి రావడంతో తోటి మనిషి అవసరం, సలహా సంప్రదింపులు అవసరం లేకుండానే పనులు జరిగిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖులు కూడా అభిప్రాయపడుతున్నారు. .